మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను దక్కించుకుంటారు. చేపట్టిన పనులు సాగవు. పాతమిత్రుల కలయిక అనుభూతినిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యం నెరవేరుతుంది. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ విజ్ఞతకు ప్రశంసలు లభిస్తాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. పరిచయం లేని వారితో జాగ్రత్త. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. ప్రయాణం చేయవలసివస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. ఖర్చులు అదుపులో ఉండవు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్మూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషికి కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అధికం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడకల్లో అత్యుత్సాహం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఓర్పుతో అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు సానుకూలమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. మీ చిత్తశుద్ధిని కొంతమంది శంకిస్తారు. మనోధైర్యంతో మెలగండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.