Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

horoscope

రామన్

, ఆదివారం, 29 డిశెంబరు 2024 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు సామాన్యం. సంప్రదింపులతో సతమతమవుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పిల్లల గురించి ఆలోచిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. తాకట్టు విడిపించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆప్తులతో సంభాషిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితులు వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వాగ్దాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రియతముల గురించి అందోళన చెందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. కీలక వ్యవహారాలతో తలమునకలవుతారు. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. ఆత్మీయులను కలుసుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
పట్టుదలతో యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?