Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Astrology

ఠాగూర్

, శనివారం, 28 డిశెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులను ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరం తీరుతుంది. పనులు పురమాయించవద్దు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. బాధ్యతలు స్వీకరిస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దూరప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆచితూచి వ్యవహరించాలి. అందరితోనూ మితంగా సంభాషించండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలయాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనులతో సతమతమవుతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో అడుగులేయండి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు సామాన్యం. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
సన్నిహితులు వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతిలోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పిల్లల దూకుడు కట్టడి చేయండి. పత్రాలు అందుకుంటారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు ఆకస్మింగా నిలిపివేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. నోటీసులు అందుకుంటారు, పెద్దలను సంప్రదిస్తారు. కార్యక్రమాలు, ప్రయాణం వాయిదా వేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)