Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-01-2025 శుక్రవారం దినఫలితాలు : అపరిచితులతో జాగ్రత్త...

రామన్
శుక్రవారం, 31 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు సామాన్యం. ప్రణాళికలు వేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అపరిచితులతో జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖుల సాయం అర్థిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. ఎవరినీ కించపరచవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందరిలో గుర్తింపు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కృషి ఫలించకున్నా కుంగిపోవద్దు. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. లౌక్యంగా వ్యవహరించండి. అనవసర జోక్యం తగదు. ఖర్చులు విపరీతం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. కీలక పత్రాలు అందుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కార్యం సిద్ధిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. ఆప్తులను కలుసుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పబలం కార్యోన్ముఖులను చేస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి.. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ధనలాభం ఉంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తపనులు చేపడతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభజ్ఞులను సంప్రదించండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణం నిరుత్సాహపరుస్తుంది.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. తెలియని వెలితి వెన్నాడుతుంది. అతిగా ఆలోచింపవద్దు. ప్రియతములతో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యం. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ విముక్తులవుతారు. ఖర్చులు సామాన్యం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. కొత్త యత్నాలు మొదలెడతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. బంధువులతో సంభాషిస్తారు. వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments