మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు. పెద్దమొత్తం చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఆందోళన తొలగి స్థిమితపడతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఓర్పుతో యత్నాలు సాగించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ఆప్తుల సాయం అందిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. తలపెట్టిన కార్యక్రమం కొనసాగిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ శక్తిసామర్ధ్యాలపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దుబారా ఖర్చులు విపరీతం. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంప్రదిస్తారు. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్తుప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేబదుళ్ళు స్వీకరిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక చర్చల్లో పాల్గొంటారు. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ప్రముఖులకు చేరువవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.