Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-01-2025 సోమవారం దినఫలితాలు : కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు...

Advertiesment
horoscope

రామన్

, సోమవారం, 27 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండండి. కొత్త వ్యక్తులతో సంభాషించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక చర్చల్లో పాల్గొంటారు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మాట నిలబెట్టుకుంటారు. పత్రాలు అందుకుంటారు.. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కొత్త ప్రదేశం సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితులను కలుసుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. విమర్శలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. వాయిదా పడిన మొక్కులు చెల్లించుకుంటారు. ప్రయాణం సాఫీగా సాగుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగివద్దు. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం పొందుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆచితూచి అడుగేయాలి. మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆచితూచి అడుగేయండి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సామాన్యం. కొత్తయత్నాలు ప్రారంభిస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26-01-2025 ఆదివారం దినఫలితాలు : ఆప్తుల కలయిక వీలుపడదు...