మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కీలక చర్చల్లో ప్రముఖంగా పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవి దక్కదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రయాణం తలపెడతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రశాంతత పొందుతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. ధనసమస్యలెదురవుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పరిచయస్తుల వ్యాఖ్యలు బాధిస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ధనలాభం పొందుతారు. ఖర్చులు సామాన్యం. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు వాయిదా పడతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంతోషకరమైన వార్త వింటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కీలక పత్రాలు సమయానికి కనిపించవు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతి విషయంలోను ధైర్యంగా ఉంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. గృహమరమ్మతులు చేపడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. విదేశీ సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు అందుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. స్థల వివాదాలు కొలిక్కివస్తాయి.