Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-01-2025 శుక్రవారం దినఫలితాలు : రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు...

Advertiesment
horoscope

రామన్

, శుక్రవారం, 17 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. యతాలుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. విరమించుకోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక అశక్తతను
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. కొత్త పనులు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆరోగ్యం నిలకడగా ఉంటటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. మీ ఆలోచనలను కొంతమంది నీరుగార్చేందుకు యత్నిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహోకపరణాలు కొనుగోలు చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మాట నిలబెట్టుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పాతమిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండవు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సంతానానికి శుభం జరుగుతుంది. ఖర్చులు అధికం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటి విషయాలు వెల్లడించవద్దు. పనులు ముందుకు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. ఆప్తులను వేడుకలకు ఆహ్వానిస్తారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో టిక్కెట్ల స్కామ్.. ఏం దోచుకుంటున్నారో తెలుసా? ప్రోటోకాల్ దర్శనం.. రూ.50వేలు! (video)