Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో టిక్కెట్ల స్కామ్.. ఏం దోచుకుంటున్నారో తెలుసా? ప్రోటోకాల్ దర్శనం.. రూ.50వేలు! (video)

Advertiesment
venkateswara swamy

సెల్వి

, గురువారం, 16 జనవరి 2025 (13:02 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన లడ్డూ వివాదం సంచలనం సృష్టించింది. భారీ సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతిరోజూ లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. ఆయనకు భారీగా కానుకలు ఇస్తుంటారు. దీంతో హుండీ ఆదాయం భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను తితిదే బోర్డులో పనిచేసే ఓ అధికారి ఇటీవల దొంగలించినట్లు వార్తలొచ్చాయి. 
 
తాజాగా తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల మోసం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు నకిలీ టికెట్ల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోంది.  అనుమానం వచ్చిన తితిదే విజిలెన్స్‌ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపి విచారణ చేపట్టారు. విచారణలో ఈ మోసానికి సంబంధించి ఐదుగురు నిందితులు బయటపడ్డారు. 
 
వీరిలో లక్ష్మీపతి (రూ.300 టికెట్ల కౌంటర్ ఉద్యోగి), మణికంఠ (అగ్నిమాపక శాఖ సిబ్బంది), భానుప్రకాశ్ (అగ్నిమాపక శాఖ సిబ్బంది), టాక్సీ డ్రైవర్లు శశి (తిరుపతి), జగదీశ్‌ (చెన్నై) ఉన్నారు. విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, టాక్సీ డ్రైవర్లు భక్తులను సేకరించి, నకిలీ టికెట్ల ద్వారా దర్శనం చేయించేవారు. 
 
ఈ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనం: రూ.25,000
ప్రోటోకాల్ దర్శనం: రూ.50,000
ఉద్యోగుల దర్శనం: రూ.10,000 - రూ.15,000లు దోచుకుంటున్నారు. 
 
ఈ స్కామ్ వివరాలు వెలుగులోకి రావడంతో దయచేసి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుని తిరుమల పవిత్రతను కాపాడాలని.. విశ్వాసాన్ని నిలబెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-01-2025 గురువారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...