Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-01-2025 మంగళవారం దినఫలితాలు : శ్రమతో కూడిన ఫలితాలున్నాయి...

Advertiesment
daily astrology

రామన్

, మంగళవారం, 14 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోను రాజీపడద్దు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2,పాదాలు
ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆరోగ్యం జాగ్రత్త. కీలక చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణంలో విరమించుకుంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకలంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. ఖర్చులు విపరీతం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆప్తుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు చేరవేసే వారున్నారని గమనించండి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. విందులకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం. పనులు త్వరితగతిన సాగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా మెలగండి. విందుకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, నగలు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Makar Sankranti 2025: సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే..?