Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-01-2025 శుక్రవారం దినఫలితాలు : అవకాశాలను చేజిక్కించుకుంటారు...

Horoscope

రామన్

, శుక్రవారం, 10 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. చేపట్టిన పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి, ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పనులు వేగవంతమవుతాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహిండి. ఖర్చులు అదుపులో ఉండవు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ప్రయాణంలో జాగ్రత్త. అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు. ఆరోగ్యం బాగుంటుంది. దూరప్రయాణం తలపెడతారు. 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పట్టుదలతో శ్రమించండి. అవకాశాలను వదులుకోవద్దు. సంకల్పబలంతోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ఒక పట్టాన సాగవు. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ప్రయాణంలో కొత్త వారితో జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఖర్చులు విపరీం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివేసి వెళ్లకండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంద్రింపులు పురోగతిన సాగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మొదలు పెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....