మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త పనులు చేపడతారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణం తలపెడతారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒత్తిడికి గురవుతారు. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. సన్నిహితులతో సంభాషిస్తారు. విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యం. ఆరోగ్యం బాగుంటుది. పత్రాలు అందుకుంటారు. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు స్థిమితంగా పూర్తి చేస్తారు. ప్రముఖులకు స్వాగతం పలుకుతారు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చిత్తశుద్ధితో యత్నాలు సాగించండి. అనుమానాలకు తావివ్వవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. ధనసమస్యలెదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. వాయిదాలు చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, పురమాయించవద్దు. అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. గృహంలో ఉత్సాహ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లావాదేవీల్లో భేషజాలకు పోవద్దు. స్థిరాస్తి ధనం అందుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణసమస్య నుంచి విముక్తులవుతారు. ఖర్చులు అధికం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానం దుడుకుతనం ఇబ్బంది కలిగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు మనస్థాపం కలిగిస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. పందాలు, పోటీల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఖర్చులు అదుపులో ఉండవు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. దైవకార్యంలో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.