మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా పనులు పూర్తి చేస్తారు. పందాలు, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికం, పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. ఖర్చులు విపరీతం. రశీదులు జాగ్రత్త. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కార్యసిద్ధి, వాహనయోగం ఉన్నాయి. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ శ్రీమతి వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అంచనాలను భిన్నంగా ఉంటాయి. రాబడిపై దృష్టి సారిస్తారు. పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. క్రీడాపోటీల్లో రాణిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త సమస్యలెదురవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. గృహావసరాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. స్థిరచరాస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తారు. పత్రాల రెన్యువల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.