మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యం సాధించే వరకు శ్రమిండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. ఆప్తులకు కానుకలు అందిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యం సాధించే వరకు శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్తవారితో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కోల్పోయిన పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను సంప్రదిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఖర్చులు విపరీతం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుకుంటారు, చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కీలక వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతిలోపం. మీ ఇబ్బందులను ఆప్తులకు తెలియజేయండి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. కొత్త విషయం తెలుసుకుంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
బంధుమిత్రులతో సంభాషిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. లైసెన్సులు, పర్మిట్లల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఉల్లాసంగా గడుపుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పనులు సానుకూలమవుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఖర్చులు విపరీతం, అవసరాలు వాయిదా వేసుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. నోటీసులు అందుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.