కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం 2024లో రూ. 1365 కోట్లు వచ్చినట్లు తితిదే ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది రికార్డుస్థాయి ఆదాయం అని పేర్కొంది. కానుకల రూపంలో శ్రీవారికి వచ్చిన ఆదాయం ప్రతి ఏటా పెరుగుతున్నట్లు తితిదే చెప్పింది.
కాగా 2024 సంవత్సరంలో స్వామి వారిని 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని వెల్లడించింది. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని 12.14 కోట్లమంది తీసుకోగా 6.30 కోట్లమందికి అన్నప్రసాదం అందించినట్లు తెలియజేసింది.