మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. పనులు నిరాటంకంగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదిస్తారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణం తలపెడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. సన్నిహితుల సాయం అందిస్తారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటటుంది. వాహనదారులకు దూకుడు తగదు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మాటతీరు ఆకట్టుకుంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త పనులు చేపడతారు. గుట్టుగా వ్యవహరించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాల రెన్యువల్ అలక్ష్యం తగదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థికపరంగా మంచి ఫలితాలున్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురికావద్దు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు అధికం. ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు
మీ కృషి ఫలిస్తుంది. వ్యవహారక్షతతో రాణిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు, కారక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలు సరిష్కారమవుతాయి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అందరితోను మితంగా సంభాషించండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఓర్పుతో యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొందరి వ్యాఖ్యులు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. చెల్లింపులు, అవసరాలు వాయిదా వేసుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
రుణ సమస్యలు చికాకుపరుస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో సంభాషిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్దేశిత ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.