మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అపోహలకు తావివ్వవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరానికి ధనం సర్దుబాటవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. సోదరులతో మధ్య కొత్త విషయాలు సంప్రదిస్తారు,
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ నమ్మకం, కృషి ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు మెదలెడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. అర్థాంతంగా పనులు ముగిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితుల సలహా పాటించండి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. కీలక పత్రాలు అందుకుంటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. పాత పరిచయస్తులు తారసపడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
స్థిరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పొగిడే వారితో జాగ్రత్త. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.