Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-01-2025 మంగళవారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

Advertiesment
Weekly astrology

రామన్

, మంగళవారం, 21 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి. సామరస్యంగా మెలగండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పొగిడే వ్యక్తులను నమ్మవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పాత పరిచయస్తులు తారసపడతారు. ఖర్చులు సామాన్యం. తీరికగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు అధికం. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పిల్లల దూకుడు అసహనం కలిగిస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలతో సతమతమవుతారు. పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. ఖర్చులు విపరీతం. ఆప్తులతో సంభాషిస్తారు. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్మాన్ని సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరు కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. దూరప్రయాణం తలపెడతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
దుబారా ఖర్చులు విపరీతం. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం, పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులతో సంభాషిస్తారు. ఊచీకొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు పురమాయించవద్దు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంతోషకరమైన వార్త వింటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!