Webdunia - Bharat's app for daily news and videos

Install App

23-12-2023 శనివారం రాశిఫలాలు - శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించిన సర్వదా శుభం...

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ॥ ఏకాదశి ఉ.7.53 ద్వాదశి తె.6.19 భరణి రా.10.17 ఉ. వ. 8.23 ల 9.56. ఉ. దు. 6.16 ల 7.45.
శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ప్రత్తి, పొగాకు, నూనె వ్యాపాస్తులకు స్టాకిస్టులకు లాభసాటిగా ఉంటుంది. అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి.
 
వృషభం :- సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. నిరుద్యోగులకు అందిన ఉద్యోగ సమాచారం కొత్త ఆశలను కలిగిస్తుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. సైన్సు, గణిత, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానరాగలదు.
 
మిథునం :- మిర్చి, నూనె, కంది, వ్యాపారస్తులకు స్టాకిస్టులకు ఆశాజనకం. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. దైవ, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఇతరులకు సలహా ఇవ్వటం వల్ల మాటపడవలసివస్తుంది. 
 
కర్కాటకం :- ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. బ్యాంకుపనులు అనుకూలిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు, వైద్య రంగాల్లో వారికి చికాకు తప్పదు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
సింహం :- ఫైనాన్సు, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారు ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. ఖర్చులు, ధనసహాయానికి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య :- మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో చికాకులు తప్పవు. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
తుల :- రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలకు చురుకుతనం, పనియందు ద్యాస చాలా అవసరం. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనిచండి. కోర్టు వ్యవహారాలలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తులవారికి కలిసివస్తుంది. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. విద్యార్థులు విద్యా విషయాలపట్ల ఏకాగ్రత పెరుగుతుంది.
 
ధనస్సు :- కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు, ఒత్తిడి తప్పవు. మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి.
 
మకరం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విందులలో పరిమితి పాటించండి. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. ట్రాన్సుపోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. మీరు తలపెట్టినపనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది.
 
మీనం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

తర్వాతి కథనం
Show comments