Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-12-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

Advertiesment
Astrology
, శుక్రవారం, 22 డిశెంబరు 2023 (04:00 IST)
మేషం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగనైనా అందుతుంది. ఆకస్మికంగా బంధుమిత్రుల రాకతో గృహం కళకళలాడుతుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికం.
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీమాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. దుబారా ఖర్చులు అధికం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి. 
 
మిథునం :- నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కళాకారులకు, క్రీడా కారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక అవకాశం అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయే ఆస్కారం ఉంది. బంధు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం :- మీ వాక్చాతుర్యమునకు తేలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఫలసాయం ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. 
 
సింహం :- విదేశీ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం కాగలవు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బందికి గురిచేస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, పనిభారం తప్పవు. 
 
కన్య :- బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దుబారా ఖర్చులు చేస్తారు. దంపతులు మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
తుల :- విద్యార్థులు క్రీడలు, క్యాంపస్ సెలక్షన్లలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటా బయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. చిరు వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. 
 
వృశ్చికం :- శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. దైవదీక్షల పట్ల ఆసక్తినెలకొంటుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో సమస్యలు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. 
 
ధనస్సు :- ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బంధు మిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మకరం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పుల వల్ల మాటపడతారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. పాత మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. 
 
కుంభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఒక్కొసారిమీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. 
 
మీనం :- కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ధనం ఎంత వస్తున్న నిల్వ చేయలేకపోతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sani Transit 2023 – 2026: ఏ రాశులకు లాభం?