Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-12-2023 గురువారం దినఫలాలు - సాయిబాబా సందర్శించిన ఆరాధించిన శుభం...

Advertiesment
Astrology
, గురువారం, 21 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ॥ నవమి ఉ.11.36 దేవి రా.12.16 ప.వ.12.58 ల 2.29. ఉ.దు. 10.01 ల 10.45 పు.దు. 2.25 ల3.09.
సాయిబాబా సందర్శించిన ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం :- ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. భాగస్వామిక చర్చలు ఆర్థాంతంగా ముగుస్తాయి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
వృషభం :- ఖాది, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు గోప్యంగా ఉంచిఎదుటివారి తత్వన్ని గమనించండి. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. 
 
మిథునం :- విద్యా విషయంలో ఏకాగ్రతతో వ్యవహరించాలి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. స్త్రీలకు బంధువర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కర్కాటకం :- హోటల్, క్యాటరింగ్ వ్యాపారులకు లాభం. వాహనం ఇతరుకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా ధనం ఖర్చు చేస్తారు.
 
సింహం :- విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదా పడును. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, పనివారలో సమస్యలు ఎదుర్కోక తప్పదు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కన్య :- నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పడికి వాటిని సద్వినియోగం చేసుకొలేకపొతారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు.
 
తుల :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
ధనస్సు :- మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. సంతాన విషయంలో సంజాయిషీలు ఇచ్చుకొనవలసి వస్తుంది. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధాలు రావచ్చు. జాగ్రత్త వహించండి. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను తొరగా ముగించుకుంటారు.
 
మకరం :- ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
 
కుంభం :- స్త్రీలు తేలికగా మోసపోయే అస్కారం కలదు. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. కోర్టు, స్థల, ఆస్తి వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఇతరుల నుంచి స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదుర్కుంటారు.
 
మీనం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పొదుపు పథకాలు, చిట్ ఫండ్ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. నిర్మాణ పనుల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. సంఘంలో మంచి పేరు, ఖ్యాతిలభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గశిర దుర్గాష్టమి.. అమ్మాయిలకు పుస్తకాలు, పండ్లు దానం చేస్తే?