Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-12-2023 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో...

Advertiesment
astrolgy
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక ఐ|| సప్తమి సా.4.00 పూర్వాభాద్ర తె.3.12 ఉ.వ.10.46 ల 12.16.
ఉ.దు. 8.32 ల 9.16 రా.దు. 10.3211.24.
ఆంజనేయస్వామిని తమలపాకులతో ఆరాధించడంవల్ల సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. గృహంలో ప్రశాంత వతావరణం నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. నిరుద్యోగులకు ఆశాజనకం. ప్రముఖుల కలయిక మీకెంతో ఉపకరిస్తుంది.
 
వృషభం :- స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
మిథునం :- బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం :- వృత్తిపరంగా ఎదురైన ఆటాకాలను అధికమిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు. ప్రయాణాల్లోను, వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. మీ ఆశయసిద్ధికి నింతర కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం.
 
సింహం :- రాజకీయనాయకులకు ఇతరులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. ఫైనాన్సు, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగాల్లో వారికిఓర్పు, నేర్పు చాలా అవసరం. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ, వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కన్య :- ప్రింటింగ్ రంగాల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం అన్నట్లుగా ఉంటుంది. స్త్రీలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవటం శ్రేయస్కరం. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. రావలసిన ధనంలో కొంత మొత్తం చేతికందుతుంది. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
తుల :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు.మిత్రులను కలుసుకుంటారు. దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు పెండింగ్ తోటివారి సాయంతో పనులను పూర్తి చేయగల్గుతారు. బంధువులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ప్రైవేటు సంస్థలోని వారి సమర్థతకు గుర్తింపు లేకపోగా మాటలు పడవలసి వస్తుంది. స్త్రీలు ధనం బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు, చర్చలు అనుకున్నంత చురుకుగా సాగవు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. ఇతరులను వాహనం అడిగి భంగపాటుకు గురవుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రయాణాలు అనుకూలం. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది.
 
మకరం :- వృత్తి ఉద్యోగాల్లో ఏ మార్పు లేకపోవటంతో అశాంతికి లోనవుతారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం శ్రేయస్కరం. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మీ ఔన్నత్యాన్ని ఎదుటివారు గుర్తిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి.
 
కుంభం :- ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నూతన పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. విద్యార్థినులకు సహచరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. కుటుంబ, ఆర్థిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది.
 
మీనం :- ఉన్నతస్థాయి అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రుణం కొంత మొత్తం చెల్లించి రుణదాతలను సంతృప్తిపరుస్తారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు తప్పవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్గశిర మాసం సోమవారం- స్కంధ షష్ఠి.. పూజ ఇలా చేస్తే?