Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sani Transit 2023 – 2026: ఏ రాశులకు లాభం?

Advertiesment
Lord Shani
, గురువారం, 21 డిశెంబరు 2023 (14:46 IST)
శనిగ్రహ మార్పు కారణంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయనేది తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. బుధవారం సాయంత్రం 5.20 గంటలకు శనిదేవుడు మకరరాశి నుంచి కుంభరాశిలో ప్రవేశించారు. ఈ పరివర్తనం కారణంగా మార్చి 6, 2026 వరకు కుంభరాశిలో శనిదేవుడు ఉంటాడు.
 
నవగ్రహాలలో వృత్తి గ్రహం అయిన శని, డిసెంబర్ 20వ తేదీ బుధవారం మకర రాశి ధనిష్టా నక్షత్రం 2వ పాదము నుండి కుంభ రాశి ధనిష్టా నక్షత్రం 3వ పాదానికి పరివర్తనం చెందాడు. మార్చి 6, 2026 వరకు కుంభరాశిలో ఉంటాడు. ఈ శని పరివర్తనం.. అనే మార్పుతో 12 రాశుల స్థానాలను  పరిగణనలోకి తీసుకోవాలి. ఆ విధంగా, ప్రస్తుతం మీనరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. కన్యారాశిలో కేతువు సంచరిస్తున్నాడు. తదుపరి శని సంచారానికి ముందు ఏప్రిల్ 26, 2025 నుండి కుంభం, సింహరాశిలోకి రాహుకేతువులు వెళతారు. 
 
గురు గ్రహం 30 ఏప్రిల్ 2024 వరకు మేషరాశిలో, 1 మే 2024 - 13 మే 2025 నుండి వృషభరాశిలో, 14 మే 2025 నుండి మిథునరాశిలో సంచరిస్తారు. శని, రాహుకేతువుల మార్పుతో ఈ రాశులకు లాభమో చూద్దాం.. 
 
ఈ రాశులకు లాభం: మేషం, కన్య, ధనుస్సు.
ఈ రాశులు అప్రమత్తంగా వుండాలి.. శనిగ్రహ మార్పుతో మాధ్యమ ఫలితాలు: వృషభం, మిథునం, తుల
పరిహారం చేయాల్సిన రాశులు: కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం
 
మేషరాశి- లాభం
వృషభ రాశి- ప్రయాణాలలో పురోభివృద్ధి
మిథునరాశి- అనుగ్రహించిన శని తండ్రితో విభేదాలు, ధన సమస్య
కర్కాటక రాశి- అష్టమ శని ప్రతి విషయంలో శ్రద్ధ అవసరం
సింహ రాశిలో శనిపై దృష్టి - జీవిత భాగస్వామితో నిరాశ
కన్యా రాశి- రుణాలు తొలగిపోతాయి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
తులారాశి - పంచమ శని.. పిల్లలతో వాగ్వాదం
వృశ్చికం- అర్థాష్టమ శని గృహం, భూమి, వాహనంలో సమస్య
ధనుస్సు- ధైర్యం, జ్ఞానం లభిస్తుంది.
మకర రాశి - ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త 
కుంభ రాశి- ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం
మీన రాశి- ఆర్థిక వృధా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేడు ఆ తరహా టిక్కెట్లు రద్దు