Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనిగ్రహ వక్ర నివృత్తి.. మేషం, మిథునం, సింహరాశికి?

Advertiesment
Lord Shani
, గురువారం, 26 అక్టోబరు 2023 (14:17 IST)
నవగ్రహాలలో ధర్మాత్ముడు, నీతిమంతుడు శని భగవానుడు రాశిలో సంచరించడం ప్రారంభిస్తే సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శని భగవానుని చూసి అందరూ భయపడతారు ఎందుకంటే అతను మంచి చెడులను రెట్టింపు చేయగలడు. 
 
మనం చేసే పనిని బట్టి బహుమతులు ఇవ్వడం మాత్రమే అతని పని. కాబట్టి అతన్ని చూస్తే భయపడాల్సిన పనిలేదు. ఒక్కసారి శని ఇవ్వడం మొదలుపెడితే ఎవరూ ఆపలేరు. అది మంచి అయినా సరే చెడు అయినా సరే. అలాంటి శని వక్ర నివృత్తి వచ్చే నవంబర్ 4వ తేదీన ప్రాప్తిస్తుంది. దీని వల్ల అనేక రాశుల వారు ఎన్నో లాభాలను పొందబోతున్నారు. 
 
ఆ రాశుల గురించి.. 
మేషం: శనిగ్రహం ఈ రాశికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారం కలిసివస్తుంది. రాబోయే కాలం మంచి కాలం అవుతుంది. కార్యాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శారీరక ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది.
 
వృషభం: శని మీకు రాజయోగాన్ని ప్రసాదించబోతున్నాడు. డబ్బు విషయాలలో మెరుగుదల ఉంటుంది. ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. వ్యాపారాభివృద్ధి వుంటుంది. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
 
మిథునం : వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అనుకోని సమయంలో అదృష్టం రాబోతుంది. నగదు లాభం వుంటుంది. శ్రమకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా మెరుగైన జీవితం గడుపుతారు. 
 
సింహం: శని దేవుడు మీకు మంచి యోగాలను ఇస్తాడు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభాన్ని, విజయాన్ని అందిస్తాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సమస్యలు తొలగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివ ప్రదోష స్తోత్రము.. సాయంత్రం 4.30 గంట నుంచి..