Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-12-2022 మంగళవారం దినఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల సర్వదా శుభం..

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- ఉద్యోగస్తుల సమర్థకు గుర్తింపు, నగదు బహుమతి పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల పరిచయాలతో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఒక నష్టాన్నిమరో విధంగా పూడ్చుకుంటారు. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూలమవుతాయి.
 
వృషభం :- మీ సంతానం కోసం ధనం విచ్చల విడిగా వ్యయం చేస్తారు. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఇతరుల క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిదని గమనించండి.
 
మిథునం :- ఆస్తి పంపకాల విషయమై దాయాదులతో ఒప్పందానికి వస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. రావలసిన ఆదాయంపైదృష్టిసారిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పైఅధికారుల నుంచి ఊహించని చికాకులను ఎదుర్కుంటారు. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు.
 
సింహం :- విదేశీ చదువులకు మార్గం సుగమమవుతుంది. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి పనివారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
తుల :- సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. బంధువులు రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమ, పనిభారం అధికమవుతాయి.
 
వృశ్చికం :- బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు కార్యక్రమాలలో ఒత్తిడి అధికమవుతుంది. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విద్యార్ధులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలు పట్టువిడుపు ధోరణితో మెలగాలి.
 
ధనస్సు :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు గృహ రుణం మంజూరవుతుంది. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. రాజకీయాల్లో వారికి తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం :- దంపతుల మధ్య సఖ్యతా లోపం, పట్టింపులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఉన్నతాధికారులు ధనప్రలోభానికి దూరంగా ఉండటం క్షేమదాయకం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
కుంభం :- మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
మీనం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను సమర్థంగా నిర్వహిస్తారు. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. దాన, ధర్మాలు చేసి మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments