Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-12-22 సోమవారం దినఫలాలు - క్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తే..

Astrology
, సోమవారం, 19 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
వృషభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
మిథునం :- నిరుద్యోగులు వచ్చిన అవకాశం చిన్నదైనా సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
కర్కాటకం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కుంటారు. పాత మిత్రుల కలయిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
సింహం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడక తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృత్తి, వ్యాపారస్తులకు ఒడిదుడుకులు తప్పవు. విందుల్లో పరిమితి చాలా అవసరం.
 
కన్య :- ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహన లోపం వంటివి ఉండగలవు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి. స్త్రీలకు బంధువులనుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదురవుతాయి.
 
తుల :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- స్త్రీలకు పనివారితో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
ధనస్సు :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొటారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
మకరం :- విద్యార్థులు క్రీడలు, పోటీల్లో రాణిస్తారు. రాబడికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. కళత్ర వైఖరి చికాకు కలిగిస్తుంది పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
కుంభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
మీనం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18-12-22 ఆదివారం దినఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా..