Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-12-2022 గురువారం దినఫలాలు - సాయిబాబాను దర్శించినా లేదా పూజించిన...

Advertiesment
astrolgy
, గురువారం, 15 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. స్వశక్తితో పైకొచ్చిన మీరు, మరింత ముందు కెళ్లాలంటే తగిన సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. రోజువారీ ఖర్చులు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం.
 
వృషభం :- సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రింటింగ్ స్టేషనరీ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. దైవ, సేవా, పుణ్య కార్యాలలో నిమగ్నమవుతారు.
 
మిథునం :- బాధలు వంటి వాటిని వదలి సంతోషమైన జీవితాన్ని గడపండి. నియమాలకు కట్టుబడి ఉండుటవలన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఏకాగ్రత అవసరం. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ జీవితభాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.
 
కర్కాటకం :- వ్యాపార విషయముల యందు జాయింట్ సమస్యలు రావచ్చును. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించి లబ్ధి పొందటానికి యత్నిస్తారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
సింహం :- ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆత్మీయుని రాక చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. న్యాయ వాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, అవాంతరాలు తప్పవు. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. రిప్రజెంటటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది. పొదుపు పథకాలు, నూతన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తి చేస్తారు. కొనుగోలు దార్లతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి.
 
తుల :- విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. పెద్దలకు అప్పుడప్పుడు వైద్య సేవతప్పదు. స్త్రీలకు పనిలో చికాకులు అధికం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికుల వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- ఉపాద్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. వ్యాపార వర్గాల వారు కొనుగోలుదార్లతో జాగ్రత్తగా మెలగవలసివస్తుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితో వ్యవహరించటంతో ఒక సమస్య పరిష్కారం కాగలదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది.
 
ధనస్సు :- విద్యార్థులు మొండివైఖరి అవలంభిచుట వల్ల మాటపడక తప్పదు. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు అతి చనువు ఇవ్వటం మంచిది కాదనిగమనించండి. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. హోటల్ తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం.
 
మకరం :- వ్యాపకాలు తగ్గించుకుని ఉద్యోగ, వ్యాపారాలపై దృష్టి సారించండి. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోనివారికి కలిసివచ్చేకాలం. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు.
 
మీనం :- స్త్రీలకు టి.వి, కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్ధినుల మొండితనం అనర్థాలకుదారి తీస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-12-2022 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించిన...