Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-12-2022 శనివారం దినఫలాలు - విఘ్నేశ్వరుని పూజించడం వల్ల...

Advertiesment
Astrology
, శనివారం, 17 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- బంధు మిత్రుల రాకపోకలతో గృహం సందడి నెలకొంటుంది. ఆర్థికస్థితి మెరుగు పడుతుంది. ఇతర బాకీలు సకాలంలో చెల్లింపులు జరుపుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. 
 
వృషభం:- ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరగవచ్చు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. దైవదర్శనాలు అను కూలిస్తాయి. భూ సంబంధ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. బంగారం, వస్త్రాలు, వాహనం వంటివి కొనుగోలు చేస్తారు.
 
మిథునం :- విద్యార్థులకు తోటివారితో సాన్నిత్యం, ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం వృద్ధి. ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. ప్రేమికులకు ఎడబాటు తప్పవు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. 
 
కర్కాటకం :- భాగస్వామిక చర్చలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్పెక్యులేషన్ లాభదాయకం. తలచిన కార్యాలన్నీ త్వరగా నెరవేరగలవు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. స్త్రీల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థినులకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి.
 
సింహం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు షాపింగుల్లోను, ప్రకటనల పట్ల ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, ఉద్యోగస్తులకు సామాన్యం. విశ్రాంతి లోపం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని విషయాల్లో అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. ఇంటా, బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
కన్య :- ముఖ్యులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెడతారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి విలువైన వస్తు, వాహనాలు కొనుగోలుచేస్తారు. బంధు మిత్రుల రాకపోకలతో గృహంలో సందడి కానవస్తుంది. ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగస్తులకు సామాన్యం.
 
తుల :- విందు, వినోదాలు, బంధువులతో అధికభాగం కాలక్షేపం చేస్తారు. స్త్రీలకు ప్రతి విషయంలో ఓర్పు, నేర్పు అవసరం. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు ధనం సర్దుబాటుకాగలదు. కొబ్బరి, పండ్ల, పూలవ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగులకు స్వల్ప చికాకులు ఉన్నప్పటికిప్రతి విషయంలో చొచ్చుకుని ముందుకుపోతారు.
 
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి. సంఘంలో గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. స్త్రీలతో మితంగా సంభాషించండి. పొదుపు పథకాలు, నూతన వ్యాపారాల దిశగా మీ ఆలోచనలుంటాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
ధనస్సు :- స్త్రీలు విలువైన వస్తు, ఆభరణాలు అమర్చుకుంటారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాయిదా పడిన పనులుఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు.
 
మకరం :- నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబీకుల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. ఆత్మీయులరాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం ఫలించదు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు ఏ విషయంపైనా ఆసక్తి పెద్దగా ఉండదు.
 
కుంభం :- స్త్రీలకు విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తి కావు. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు.
 
మీనం :- దైవదర్శనాలు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. బంధు, మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుర్మాసం ప్రత్యేకత.... ఈ మాసంలో విష్ణుపూజ చేస్తే..?