Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-12-22 ఆదివారం దినఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా..

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (05:00 IST)
మేషం :- గృహసామగ్రి, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు కలిసివస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత చోటుచేసుకుంటుంది. బంధువులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వార్తా సిబ్బందికి చిన్న చిన్న తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. రవాణా రంగంలోని వారికిచికాకులు అధికమవుతాయి.
 
వృషభం :- ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహరాల్లో చికాకు లెదురవుతాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పని వారితో సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం.
 
మిథునం :- బంధు మిత్రులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు. విద్యార్థులు పై చదువులకోసం దూర ప్రదేశానికి వెళ్ళవలసివస్తుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. ఉత్తర ప్రత్తురాలు సంతృప్తినిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సాహస ప్రయత్నాలు విరమించండి. కానివేళలో బంధు మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
సింహం :- స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
 
కన్య :- మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం వరిస్తుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
తుల :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. గృహంలో మార్పులు, చేర్పుల కోసం చేసే ప్రయాత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ బలహీనతలు, ఆగ్రహావేశాలు ఇబ్బందులకు దారితీసే అస్కారం ఉంది.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు పని భారం అధికంచిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. బంధువుల రాకతో స్త్రీలకు అసౌకర్యం, చికాకులు తప్పవు. అయిన వారి కోసం తాపత్రయపడతారు.
 
ధనస్సు :- ఒక మంచి చేశామన్న భావం సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు చురుకుతనం, పనియందు ద్యాస చాలా అవసరం. పెద్దమొత్తం సరుకు నిల్వలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. బాకీలు, ఇంటి అద్దెల వసూలలో సంయమనం పాటించండి.
 
మకరం :- ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటంమంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాలు కలిసివస్తాయి. మీ అతిచనువును ఇతరులు అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. పాత పరిచయస్తులు, ఆప్తులను కలుసుకుంటారు. సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువు రాకతో ఖర్చులు అధికమవుతాయి. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. తలపెట్టిన పనిలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తిగా పూర్తి చేస్తారు.
 
మీనం :- మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడటంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. ఎన్ని అవరోధాలు తలెత్తిన వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. పాత బాకీలు తీరుస్తారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments