Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-12-2022 నుంచి 24-12-2022 వరకు మీ వార రాశిఫలితాలు

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (23:52 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. సహాయం ఆశించవద్దు. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. మంగళ, బుధవారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. వ్యాపకాలు అధికమవుతాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో పునరాలోచన మంచిది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు స్థానచలనం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. చేతివృత్తులు, కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. గృహమార్పు చికాకుపరుస్తుంది. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. జూదాల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఆప్తుల సలహా పాటించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. ప్రముఖులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య, రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సహాయం ఆశించవద్దు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనదారులకు దూకుడు తగదు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
సత్కాలం ఆసన్నమైంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అజ్ఞాతవ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ఆచితూచి అడుగేయాలి. సంతానం విదేశీవిద్యాయత్నం ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి బంధువులకు అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆది, సోమవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలోను మీదై పైచేయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మంగళవారం నాడు ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. బుధ, గురువారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. అవివాహితులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణసమస్యలు వేధిస్తాయి. ఆదివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించినంత ఫలితమీయవు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సోమ, మంగళవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. తొందరపాటుతనం నల్ల నష్టాలు తప్పవు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగ్లకు పాల్పడవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments