Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GQ టీమ్ నుండి అరుదైన గౌరవాన్ని,అవార్డును అందుకున్న అల్లు అర్జున్

Advertiesment
GQ MOTY Awards 2022
, గురువారం, 15 డిశెంబరు 2022 (07:22 IST)
GQ MOTY Awards 2022
పుష్ప: ది రైజ్, అన్ని రికార్డులను బద్దలు కొట్టి మరియు కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అల్లు అర్జున్ గత 20 ఏళ్లలో స్టార్ పెర్ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు, అయితే పుష్ప సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందాడు అల్లుఅర్జున్. 
 
అల్లు అర్జున్ తన పుష్ప ఫేమ్‌తో సరిహద్దులు దాటి ఇప్పుడు ప్రతిచోటా తన సత్తాను చాటాడు. CNN 18 సత్కారంలో  ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ గా, అలానే SIIMA మరియు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.
 
ఇటీవల అల్లు అర్జున్ ప్రసిద్ధ GQ MOTY అవార్డ్స్ 2022 కి ఎంపికయ్యాడు. MOTY, మెన్ ఆఫ్ ది ఇయర్ కోసం GQ అవార్డ్స్ 2022 లో అల్లు అర్జున్ 'లీడింగ్ మ్యాన్'గా పిలువబడ్డాడు. అల్లు అర్జున్‌కి ఈ అవార్డును అందించడానికి GQ టీమ్ మొత్తం హైదరాబాద్‌కు తరలివచ్చింది. అల్లు అర్జున్‌కి అవార్డును అందజేయడానికి వారు ఐకానిక్ తాజ్ ఫలుఖ్‌నామా ప్యాలెస్‌లో పార్టీని కూడా నిర్వహించారు.
 
ఒక టాలీవుడ్ నటుడు GQ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఐకాన్ స్టార్‌పై GQ టీమ్ ప్రేమ మరియు గౌరవాన్ని చూసిన తర్వాత అల్లు అర్జున్ అభిమానులు సంతోషిస్తున్నారు.
 
GQ ఈ సంవత్సరం MOTY అవార్డుల కోసం దీపికా పదుకొనే, కార్తీక్ ఆర్యన్, రాజ్‌కుమార్ రావు, భూమి పెడ్నేకర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ మరియు అయాన్ ముఖర్జీ వంటి ఇతర నటుల రచనలను కూడా హైలైట్ చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపికా పదుకునేకు హోం మంత్రి వార్నింగ్.. ఏమైందంటే?