Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపికా పదుకునేకు హోం మంత్రి వార్నింగ్.. ఏమైందంటే?

deepika padukone
, బుధవారం, 14 డిశెంబరు 2022 (20:11 IST)
ప్రముఖ నటి దీపికా పదుకునేకు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. దీపికా పదుకొణె-షారుక్‌తో కలిసి 'పఠాన్‌' చిత్రంలో నటించింది. తాజాగా ఈ చిత్రంలోని పాటను విడుదల చేశారు. ఈ పాటలో అసభ్యకరంగా డ్యాన్స్ చేయడంతో పాటు డ్రెస్ అభ్యంతరకరంగా వుందని విమర్శలు వచ్చాయి. 
 
దీంతో ‘బాయ్‌కాట్‌ పఠాన్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దీపికా పదుకొణెను హెచ్చరించారు. 
 
ఈ పాటలోని సన్నివేశాలు, కాస్ట్యూమ్స్‌ను సరి చేయాలని, లేనిపక్షంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సినిమాను విడుదల చేయకుండా నిషేధిస్తామన్నారు. ఆయన ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధన్య బాలకృష్ణన్ నటించిన జగమే మాయ డిస్నీలో స్ట్రీమింగ్