Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-10-2022 మంగళవారం దినఫలాలు - కనకదుర్గ అమ్మవారిని ఎర్రని పూజించినా...

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- ధనం సకాలంలో అందక నిరుత్సాహం చెందుతారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగసులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
 
మిథునం :- ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. దంపతుల మధ్య పరస్పర అవగాహన కుదరదు.
 
కర్కాటకం :- ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రముఖులతో పరిచయాలు అధికమవుతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. బంధువుల రాకతో అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
సింహం :- బంధువుల రాక వల్ల తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
కన్య :- స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. రేపటి గురించి అధికంగా ఆలోచిస్తారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైన కాలం. హోటల్ వారికి పనిభారం అధికమవుతుంది. పిల్లల కోసం, ప్రియతముల కోసం అధికంగాఖర్చు చేస్తారు. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది.
 
తుల :- ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పాత మిత్రుల కలయికతో గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పెద్దలతో ఏకీభవించలేకపోతారు.
 
వృశ్చికం :- మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. స్నేహ బృందాలు అధికం అవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు.
 
ధనస్సు :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీసంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఫ్యాన్సీ, కిరణా, మందుల వ్యాపారస్తులకు లాభదాయకం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును.
 
మకరం :- మనుష్యుల మనస్థత్వం తెలిసి మసలుకొనుట మంచిది. స్త్రీలు ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. బంధువుల రాకతో వస్త్రా, విలువైనవస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాలలో మెలకువ అవసరం.
 
కుంభం :- ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకటు విడిపించుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది.
 
మీనం :- బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు జరిగింది.. క్షమించండి.. అభిమానులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

అన్నీ చూడండి

లేటెస్ట్

Tortoise: క్రిస్టల్ తాబేలును ఇంట్లో వుంచుకుంటే ఏం జరుగుతుంది? (video)

Durga Ashtami Vrat: జనవరి 7, 2025 : అష్టమి తిథి నేడు.. అదీ మంగళవారం.. దుర్గాష్టమి.. ఇలా పూజ చేస్తే?

07-01-2025 మంగళవారం దినఫలితాలు : స్వయంకృషితో లక్ష్యం సాధిస్తారు...

Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే

06-01-2025 సోమవారం దినఫలితాలు : ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments