Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29-09-2022 గురువారం దినఫలాలు - హయగ్రీవ స్తోత్రం పఠించినా సర్వదా శుభం...

Astrology
, గురువారం, 29 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. స్త్రీల మాటకు కుటుంబంలో ఆమోదం, గౌరవం లభిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
వృషభం :- లౌక్యంగా మెలిగి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పాతమిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడినపనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహరాలు వాయిదాపడటం మంచిది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
 
మిథునం :- వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత, ఓర్పు ఎంతో ముఖ్యం. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
కర్కాటకం :- ఆర్థికంగా ఎదగటానికి చేయుయత్నాలు ఫలించవు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనిభారం అధికం.
 
సింహం :- కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రాజకీయనాయకులు తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
కన్య :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెలకువ వహించండి.
 
తుల :- వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రైవేటు విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. 
 
వృశ్చికం: - ఒప్పందాలు, చెక్కుల జారీల విషయంలో ఏకాగ్రత వహించండి. వాతావరణంలోని మార్పులు వల్ల మీ పనులు వాయిదాపడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. స్త్రీలు షాపింగ్‌లో ఏకాగ్రత వహిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మకరం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో త్వరలోనే లభిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత ముఖ్యం.
 
కుంభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీరు ప్రారంభించిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలకు ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. రావలసిన ధనంలో కొంతమొత్తం చేతికందుతుంది.
 
మీనం :- ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రి 2022 మూడో రోజు రాయల్ బ్లూ దుస్తులు ధరించాలి