Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-09-2022 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా...

Advertiesment
Weekly astrology
, సోమవారం, 26 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. సంఘంలో గౌరవం లభిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కుంటారు.
 
వృషభం :- హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లలో విజయం సాధిస్తారు. వాహనచోదకులకు ఊహించని చికాకులు అధికమవుతాయి. టి.వి., రేడియో రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
 
మిథునం :- ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. అధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇతర విషయాలపై ఆసక్తిని తగ్గించి, స్వవిషయాలపై శ్రద్ధ పెడితే మంచిది.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇవ్వగలవు. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందులు ఎదుర్కుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులుంటాయి. మొండి బకాయిలు వసూలు కాగలవు. స్థిరాస్తి అమ్మకానికై చేయుయత్నం విరమించుకోవటం మంచిది.
 
సింహం :- ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచితవ్యక్తుల పట్ల అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసి వస్తుంది. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. స్త్రీలు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు.
 
కన్య :- ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్ళేందుకు మార్గం సుగమమవుతుంది. అవివాహితులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
తుల :- మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఇతర కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. రావలసిన ధనం ఆలస్యంగా చేతి కందుతుంది. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు.
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ప్రముఖులు, అయిన వారిని కలుసుకుంటారు. మీ యత్నాల్లో పొరపాట్లు దొరే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- కుటుంబీకులను పట్టించుకు నేందుకు క్షణం తీరిక ఉండదు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. రోజులు భారంగా, మందకొడిగా సాగుతాయి అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు.
 
మకరం :- రవాణా రంగాల వారికి ఇబ్బందులు అధికమవుతాయి. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది.
 
కుంభం :- ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహరాల్లో పునరాలోచన అవసరం. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 
 
మీనం :- బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోకతప్పదు. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

25-09-2022 ఆదివారం దినఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం..