Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-09-2022 బుధవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం..

Advertiesment
astro10
, బుధవారం, 21 సెప్టెంబరు 2022 (04:04 IST)
మేషం :- ఉద్యోగయత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. క్రయ విక్రయాలు సామాన్యం. ఆప్తుల ఆకస్మిక బదిలీ ఆందోళన కలిగిస్తుంది. వాహనం నిదానంగా నడపటం మంచిది.
 
వృషభం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
 
మిథునం :- మహిళా ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, తోటివారితో చికాకులు తప్పవు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, తరుచు పర్యటనలు అధికం.
 
కర్కాటకం :- కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన అవసరం. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ధనవ్యయంలో మితం పాటించండి.
 
సింహం :- స్త్రీలకు ఆరోగ్యభంగం, వైద్యపరీక్షలు తప్పవు. మీ వైపు నుంచి పొరపాట్లు, తప్పిదాలు జరుగకుండా మెలకువ వహించండి. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు గృహ రుణం మంజూరవుతుంది. తలపెట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. లాయర్ నోటీసులకు ధీటుగా స్పందిస్తారు.
 
కన్య :- ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. ఆస్తి వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ప్రయాణాలు అనుకూలం. స్త్రీలపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. వైద్య రంగాల వారి కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తాయి. పెద్దల ఆశీస్సులు, ఆత్మీయుల ప్రశంసలు పొందుతారు.
 
తుల :- బంధు మిత్రులను కలుసుకుంటారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిరుత్సాహం చెందుతారు. మతిమరుపు కారణంగా ఇబ్బందు లెదుర్కుంటారు. పాతమిత్రులు, ఆత్మీయులను కలుసుకుంటారు. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనంఉండదు.
 
వృశ్చికం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం ఒకందుకు మంచిదే. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన గుర్తింపు, ఆదాయం పొందుతారు. ప్రేమికుల తొందరపాటు చర్యలు సమస్యలకు దారితీస్తాయి.
 
ధనస్సు :- పారిశ్రామిక, సంబంధ బంధ్యవ్యాలు మెరుగవుతాయి. విద్యార్థులకు విశ్రాఒంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్లీడర్లకు చికాకు అధికమవుతాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, గృహ ప్రశాంతతకు భంగం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. ధనం ముందుగానే సిద్ధం చేసుకోవటానికి యత్నించండి.
 
మకరం :- ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు సంతృప్తి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో సంతృప్తి కానవస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో మెళకువఅవసరం.
 
కుంభం :- రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. ఇంజనీరింగు రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల చింతించక తప్పదు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తాయి.
 
మీనం :- ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తి నివ్వజాలవు. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, శ్రమ అధికం. దైవ, పుణ్య, సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై భక్తుడు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళం