Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17-09-2022 శనివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని పూజించిన...

Advertiesment
astro6
, శనివారం, 17 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావంతో పనిచేయవలసి ఉంటుంది. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. నిరుద్యోగులలో నిరుత్సాహం, నిర్లిప్తత అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
వృషభం :- విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్పెక్యులేషన్ రంగాలవారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. మిత్రుల కలయికతో రోజంతా ఆహ్లాదకరంగా గడిచిపోతుంది. ఫ్యాన్సీ, కిరణా, సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఆశాజనకం. అనురాగవాత్సల్యాలు పెంపొందగలవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం :- కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇటుక, సిమెంట్, వ్యాపారులకు చికాకులు తప్పవు. ఆర్థిక పురోగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామిక చర్చలు, స్థిరాస్తి వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
కర్కాటకం :- ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. హోటల్, తినుబండారు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఆడిటర్లకు చేజిరిపోయిందన్న కేసులు మరల తిరిగి వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
సింహం :- శెనగలు, వక్క కాఫీ పొడి, నూనె, ఎండుమిర్చి చింతపండు వ్యాపారస్తులకు పురోవృద్ది. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. రాజకీయాలలోని వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. సోదరీ, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కన్య :- ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. స్త్రీల ఆడంబరాలను చూసి ఎదుటివారు అపోహపడతారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది.
 
తుల :- ఆస్తివ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగావుండదు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. వ్యవసాయ కూలీలకు, భవన కార్మికులకు మందకొడిగా ఉంటుంది.
 
వృశ్చికం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళనతప్పదు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు స్థాన చలనానికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు భాగస్వాములతో కలిసి నూతన పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
 
మకరం :- రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఋణానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సినిమా, కళా రంగాల్లో వారికి మార్పులు అనుకూలం. నిర్మాణ పనుల్లో పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండక పోవడంతో మనశ్శాంతి లభిస్తుంది.
 
కుంభం :- బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటాయి. రాజకీయ కళా రంగాలవారికి విదేశీ పర్యటనలు అనుకూలం. మిత్రులు చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మీనం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల చికాకులు అధికమవుతాయి. ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశ్వకర్మ జయంతి 2022.. భార్యాభర్తలు కలిసి పూజ చేస్తే?