Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-09-2022 బుధవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం..

Advertiesment
Astrology
, బుధవారం, 28 సెప్టెంబరు 2022 (04:04 IST)
మేషం :- వేళతప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. పాత శత్రువులు మిత్రులుగా మారతారు. దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. విలువైన కానుకలు ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. దైవ, పుణ్యకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు.
 
వృషభం :- పాడి పరిశ్రమ రంగాల్లో వారికి శ్రమ అధికం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆయిల్, నూనె, గ్యాస్ వ్యాపారస్తులకు పనివారితో ఇక్కట్లు తలెత్తగలవు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారంఉంది. 
 
మిథునం :- విద్యాసంస్థల్లో వారికి ఉపాధ్యాయుల వల్ల ఇబ్బందులు తలెత్తగలవు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మిత్రులతో సంభాషించటం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి.
 
కర్కాటకం :- మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ రంగాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాలు ఆశించినంత ఉత్సాహంగా సాగవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
సింహం :- సంగీత, సాహిత్య అభిలాష పెరుగుతుంది. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుతుంది. ప్రైవేటు రంగాల్లో వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. రిప్రజెంటేటివ్‌లకు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. విద్యుత్ లోపం అధికం కావడంవల్ల ఆందోళనకు గురవుతారు.
 
కన్య :- ముఖ్యులతో మాటపట్టింపులు వచ్చే ఆస్కారం ఉంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థులకు దూర ప్రదేశాలలో పై చదువులకు అవకాశం లభిస్తుంది.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల రాక వల్ల చేపట్టిన పనులపై ఆసక్తి ఉండదు. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు.
 
ధనస్సు :- వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తులు అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థుల్లోకన్నా, విద్యార్థినులలో పురోభివృద్ధి కానవస్తుంది. సహకార సంఘాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
మకరం :- నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు అధికం. చిట్స్, ఫైనాన్సు రంగాలవారికి ఒత్తిడి, వేధింపులు అధికమవుతాయి. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
కుంభం :- పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు.
 
మీనం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో గుర్తింపు, ఆహ్వానాలు అందుతాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవీ నవరాత్రులలో రెండవ రోజు.. లలితా సహస్ర నామాన్ని..?