Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-10-2022 ఆదివారం దినఫలాలు - ఆదిత్యుని ఎర్రని పూలతో పూజించిన శుభం...

Advertiesment
Weekly astrology
, ఆదివారం, 2 అక్టోబరు 2022 (04:00 IST)
మేషం :- మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయాలి. ఉద్యోగస్తులు ప్రభుత్వాధికారులతో చర్చల్లో పాల్గొంటారు. మీ సంతానం నిరుద్యోగ సమస్య ఆందోళన కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతనం ఉండదు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ముఖ్యం.
 
వృషభం :- వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. ఆలయాలను సందిర్శిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించి ఒక సమస్య నుంచి బయటపడతారు. వాహనంచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టువిడిపించుకుంటారు.
 
మిథునం :- ఒక దైవకార్యానికి, పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించండి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం కాగలదు. ఉపాధ్యాయులకు చికాకులు తప్పవు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. సలహాలు ఇచ్చేవారే కాని సహాయం చేసేవారు ఉండరు. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. విద్యార్ధుల ఆలోచనల పక్కదోవ పట్టే ఆస్కారం ఉంది.
 
సింహం:- ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. మీ సంతానం పట్ల శ్రద్ధాసక్తులు కలిగి మెళుకువ వహించండి.
 
కన్య :- ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, బోనస్‌లు చేతికందుతాయి. దైవ దర్శనాలలో అసౌకర్యం ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ కార్యక్రమాలు సాఫీగా సాగవు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
తుల :- చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. విద్యార్థినులకు తోటివారి వల్ల మాటపడవలసి వస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.
 
వృశ్చికం :- హామీలు, మధ్యవర్తిత్వాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కొంత మొత్తం సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. విద్యార్థులు బజారు తినుబండారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
ధనస్సు :- వితండవాదం, భేషజాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఖర్చులు అధికం కావటంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. బ్యాంకింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కళాకారులకు అనుకూలం. భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించటం క్షేమదాయకం. స్త్రీలకు దైవకార్యానికి సంబంధించిన ఆహ్వానం అందుతుంది.
 
మకరం :- ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కీలకమైన వ్యవహరాలు గోప్యంగా ఉంచండి. ఎదుటివారిని నొప్పించకూడదన్న స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. షేర్లు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహంతప్పదు.
 
కుంభం :- దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. కొబ్బరి, పండ్ల, పూల, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మొండి బాకీలు వసూలు కాగలవు.
 
మీనం :- ఒకానొక సందర్భంలో మీ కుటుంబీకుల ధోరణి అసహనం కలిగిస్తుంది. సన్నిహితులతో దైవ పాల్గొంటారు. స్పెక్యులేషన్ కలిసిరాదు. ఆహార, ఆరోగ్య విషయాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. మిమ్మల్ని ప్రేమించే వారి మనస్సులను గాయపరచకండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్యారాశిలో బుధుడు.. ఈ రాశుల వారికి అదృష్టం...