Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-09-2022 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

Advertiesment
Astrology
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (04:00 IST)
మేషం :- వ్యాపారాల్లో మొహమ్మాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కుంటారు. ఋణయత్నం వాయిదాపడతాయి. మతిమరుపు కారణంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. స్త్రీలు షాపింగ్ లోను, కొత్త వ్యక్తులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం :- రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచన లుంటాయి. పెద్దల ఆర్యోగం గురించి ఆందోళన చెందుతారు. ఏ విషయాన్ని తెగే వరకూ లాగటం మంచిది కాదు. సోదరీ సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు పట్టింపులు చోటుచేసుకుంటాయి.
 
మిథునం :- విద్యార్థులకు ప్రేమ వ్యవహరాలు అనుకూలించవు. కుటుంబసభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ముఖ్యం. దైవ,పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు దొర్లే ఆస్కారముంది. మీ సంతానానికి కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. ఇంటా, బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
 
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల వేధింపులు, సహోద్యోగులతో చికాకులు తప్పవు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటనఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల :- విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి.
 
వృశ్చికం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 
 
ధనస్సు :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. బంధు మిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కిరాగలవు.
 
మకరం :- ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాసం ఉంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారుపనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులకు సంతృప్తి చేకూరుతుంది. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రతి వ్యవహారం మీకు అనుకూలంగానే ఉంటుంది.
 
కుంభం :- నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఊహించని ఖర్చులు అధికం అగుటవలన ఆందోళన చెందుతారు.
 
మీనం :- ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పనుల్లో జాప్యం తప్పదు. వృత్తి, వ్యాపారులకు పురోగతి కావస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నపన తిరుమంజనం.. కిరీటాలు, మాలలు.. పట్టువ్రస్తాలు.. సుందరంగా అలంకరణ