Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-03-2025 మంగళవారం దినఫలితాలు - ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు...

రామన్
మంగళవారం, 4 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం సంతృప్తినిస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. ఓర్పుతో శ్రమిండి. యత్నాలు విరమించుకోవద్దు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు అధికం. దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు. పనులు పురమాయించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆచితూచి అడుగేయండి. నోటీసులు అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం అలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణంలో కొత్తవ్యక్తులతో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి.. ఆర్భాటాలకు బాగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సామర్ధ్యంపై ధైర్యం కలుగుతుంది. ఆటంకాలెదురైనా ముందుకు సాగుతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆశావహదృక్పథంతో మెలగండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఓర్పుతో శ్రమించండి. సాయం ఆశించవద్దు. ముందుచూపుతో వ్యవహరించండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

హైదరాబాద్‌లో దారుణం- ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపాడు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

అన్నీ చూడండి

లేటెస్ట్

02-03-2025 నుంచి 08-03-2025 వరకు మీ వార రాశిఫలితాలు

Tirumala: వేసవి సెలవులు తిరుమల రద్దీ.. కొండపై కూల్ పెయింట్.. ఆదేశాలు జారీ

01-03-2025 శనివారం రాశిఫలితాలు - పత్రాల రెన్యువల్లో చికాకులెదుర్కుంటారు...

Saturday Fast Puja Rituals- శనివారం- శనిగ్రహ వ్రతం.. ఏం తినాలి.. ఏవి తినకూడదు..?

01-03-2025 నుంచి 31-03-2025 వరకు మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments