Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-02- 2025 శుక్రవారం రాశిఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Advertiesment
Rishabham

రామన్

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు సామాన్యం. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లల కదలికలపై దృష్టిపెట్టండి. వేడుకకు హాజరువుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఏ విషయానికీ అధైర్యపడవద్దు. నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. పరిస్థితులు త్వరలో రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్‌ను నిర్లక్ష్యం చేయకండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఓర్పుతో యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆవేశాలకు లోనుకావద్దు. ధనసమస్యలు ఎదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. కొత్త యత్నాలు మొదలు పెడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో మార్పులు సాధ్యవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లలకు శుభఫలితాలున్నాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. పొదుపునకు ఆస్కారం లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-02- 2025 గురువారం దినఫలితాలు - పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...