Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-02- 2025 గురువారం దినఫలితాలు - పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Advertiesment
tula rashi

రామన్

, గురువారం, 27 ఫిబ్రవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త యత్నాలు మొదలెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ధనసహాయం తగదు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. వాహనం మరమ్మతుకు గురవుతుంది. సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వివాహయత్నం ఫలిస్తుంది. తొందరపడి మాట ఇవ్వొద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో అశ్రద్ధ తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా మాట్లాడండి. ముక్కుసూటిగా పోయే మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. నోటీసులు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఖర్చులు అధికం. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సహిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. కొత్త పనులు చేపడతారు. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకుంటారు. పత్రాలు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. దూరపు బంధువులను కలుసుకుంటతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో కార్యసాధనకు శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Maha Shivratri 2025: శివుడికి పసుపు ఆవాలు సమర్పిస్తే.. ఏం జరుగుతుంది?