మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. శుక్రవారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు ఒక పట్టాన సాగవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. విందుకు హాజరవుతారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు. పనులు పూర్తి చేస్తారు. పిల్లల మొండతనం చికాకుపరుస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్చమవుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1, 2 పాదాలు
ఆత్మీయుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలు మెదలెడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆది, ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. సన్నిహితులతో సంభాషిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. దుబారా ఖర్చులు అధికం. సకాలంలో పనులు పూర్తి చేయగల్గుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర జోక్యం తగదు. వివాహ యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సోదరులను సంద్రిస్తారు. మీ శ్రీమతి సలహా తీసుకోండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సాహిస్తారు. ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రావలసిన ధనం అందుతుంది. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.