మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మనోధైర్యంత మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. వేడుకకు హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వ్యక్తులున్నారు. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చస్తారు. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. భేషజాలకు పోవద్దు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. లావాదేవీల్లో జాగ్రత్త. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. అయిన వారు సాయం అందిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఆర్ధికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. కీలక పత్రాలు జాగ్రత్త. అందరితోను మితంగా సంభాషించండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. నోటీసులు అందుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. ప్రయాణం తలపెడతారు
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ నిర్ణయం ఇరువర్గాలకూ ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ కష్టం వృధా కాదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండిధైర్యంతో ముందుకు సాగండి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రావలసిన ధనం అందుతుంది. పనులు పురమాయించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి