Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణపతి పూజకు చతుర్థి వ్రతం విశేషం.. 21 ప్రదక్షిణలు చేస్తే..?

సెల్వి
సోమవారం, 3 మార్చి 2025 (11:11 IST)
గణపతి పూజకు చతుర్థి వ్రతం విశేషమైంది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే గణపతి పూజ చతుర్థి వ్రతం రోజున చేస్తారు. ఏ రోజైతే చవితి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందో ఆ రోజు వినాయకుడికి పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున మాత్రమే కాకుండా.. మాసంలో వచ్చే చతుర్థి తిథి రోజున వినాయకుడికి గరిక సమర్పించాలి. 
 
శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది. లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చు. ఈ రోజున చతుర్థి వ్రతం చేసేవారు సాయంత్రం వేళలో వినాయకుని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయాలి.
 
ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లోనే సూర్యాస్తమయం తర్వాత విఘ్నేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి, అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించి కొబ్బరి కాయలు, పండ్లు, ఉండ్రాళ్లు, మోదకాలు, పులిహోర నైవేద్యంగా గణపతికి సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించే వారికి నవగ్రహ దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chicken Fair: మాంసాహార ఆహార ప్రియులను ఆకట్టుకున్న చికెన్ ఫెయిర్

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

డీకే శివకుమార్ సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరు : వీరప్ప మొయిలీ

వంద డిగ్రీల వేడిలో చికెన్ ఉడికించి ఆరగిస్తే బర్డ్ ఫ్లూ సోకదా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2025 శనివారం రాశిఫలితాలు - పత్రాల రెన్యువల్లో చికాకులెదుర్కుంటారు...

Saturday Fast Puja Rituals- శనివారం- శనిగ్రహ వ్రతం.. ఏం తినాలి.. ఏవి తినకూడదు..?

01-03-2025 నుంచి 31-03-2025 వరకు మాస ఫలితాలు

శుక్రవారం సాయంత్రం భార్యకు భర్త మల్లెపువ్వులు, స్వీట్లు కొనిపెడితే.. ఏం జరుగుతుంది?

28-02- 2025 శుక్రవారం రాశిఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments