సంకష్టహర చతుర్థి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు. గణేశుడిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఎవరైతే హృదయపూర్వకంగా ఉపవాసాన్ని ఆచరిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. వారి కష్టాలు తొలగిపోతాయి.
వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం సంకష్టి చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే చతుర్థి రోజున వినాయకుడికి గరిక మాల సమర్పించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి.
మార్గశీర్ష మాసంలో వచ్చే చతుర్థిని రోజున ఉపవాసం పాటించడం, గణేశుడిని పూజించడం వలన జీవితంలోని అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార సమస్యలతో బాధపడే వారు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు పొందని వారు, నిరుద్యోగులు చతుర్థి రోజున గణపతి పూజలో దర్భ గడ్డిని తీసుకుని పసుపులో ముంచి గణేశుడికి సమర్పించి ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని జపించాలి.
విద్యార్థులు మంచి చదువు, జ్ఞానం కోసం గణపతిని జమ్మి ఆకులతో పూజించాలి. అంతేకాదు ఇలా జమ్మి ఆకులను గణపతికి సమర్పించే సమయంలో ఓం శ్రీ గణేశాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించాలి. గణేశుడిని పూజించే వ్యక్తులు ఆయనకు లడ్డూలు, పండ్లు, కొబ్బరికాయలను నైవేద్యంగా సమర్పిస్తారు. మోదకాలను ఆయనకు చతుర్థి రోజున సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.