Publish Date: Fri, 06 Sep 2024 (12:09 IST)
Updated Date: Fri, 06 Sep 2024 (12:16 IST)
వినాయక చవితి రోజు.. కొబ్బరి నూనె వేసి జిల్లేడు వత్తులతో దీపం పెట్టడం పెట్టడం వల్ల మరింత విశేషంగా కలిసి వస్తుందట. వినాయకుడికి ఇదే రోజు గరికతో తయారు చేసిన మాల వేస్తే చాలా మంచిదని, ఆర్థిక కష్టాలు తొలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. గణేష్ చతుర్థి నాడు, భక్తులు గణేశుడికి మోదకాలను సమర్పిస్తుంటారు.
మోదకం విఘ్నేశ్వరునికి అత్యంత ఇష్టమైనది. అలాగే లడ్డూ, పూరన్ పోలీ, పాయసం కూడా వినాయకుడికి సమర్పించవచ్చు. గణేశుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. వినాయక చవితి పర్వదినాన వినాయకుడిని పూజించడం వల్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తొలగిపోతాయని, ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
గణేష్ చతుర్థి ప్రారంభంతో 'పండుగ సీజన్' కూడా ప్రారంభమవుతుంది. గణేష్ చతుర్థి తర్వాత మనకు నవరాత్రి, దీపావళి, దుర్గాపూజ మరిన్ని ఉంటాయి. గణేశుడి విగ్రహాన్ని ఎంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు. ఇది ఆనందం, శ్రేయస్సుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. గణేశ పూజకు కూర్చున్న గణేశ విగ్రహం తీసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
సెల్వి
Publish Date: Fri, 06 Sep 2024 (12:09 IST)
Updated Date: Fri, 06 Sep 2024 (12:16 IST)