Webdunia - Bharat's app for daily news and videos

Install App

31-12-2020- గురువారం మీ రాశి ఫలితాలు.. సాయిబాబాను ఆరాధించినట్లైతే?

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (04:00 IST)
సాయిబాబాను ఆరాధించినట్లైతే సంకల్పసిద్ధి, మనోసిద్ధి పొందుతారు. 
 
మేషం: ఉద్యోగస్తులకు ప్రమోషన్ స్థానచలనానికి ఆస్కారం వుంది. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకు పనులు హడావుడిగా సాగుతాయి. విద్యార్థుల వైఖరి ఉపాధ్యాయులకు నిరుత్సాహం కలిగిస్తుంది. కొరియర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం: ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. మీ చుట్టుపక్కల వారితో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఎదురైన పోటీని ధీటుగా ఎదుర్కొంటారు.  
 
మిథునం: పత్రికా సంస్థల్లోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. వాహన సౌఖ్యం పొందుతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగుల యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. వృత్తిపరంగా చికాకులు లేకున్నా ఆదాయ సంతృప్తి అంతగా ఉండదు. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకంటారు.
 
సింహం: దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. 
 
కన్య: వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి వుంటుంది. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులకు అనుకూలం. కోర్టుకు హాజరవుతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవాల్సి వుంటుంది.   
 
తుల: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. మిత్రుల మాటతీరు, పద్ధతి కష్టం కలిగిస్తాయి. పొదుపు చేయాలనే మీ యత్నం ఏ మాత్రం సాధ్యం కాదు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు, విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం: బ్యాంకు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తడి, చికాకులు అధికమవుతాయి. విత్తనాలు, మందులు, స్టేషనరీ, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మిమ్ములను ప్రలోభాలకు గురిచేసే ఆస్కారం వుంది. సభలు, సన్మానాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
ధనస్సు: బంగారం, వెండి, తాకట్టు వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉండగలదు. గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభమవుతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు కోరుకున్న కోర్సుల్లో అవకాశం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహం, ఆందోళన కలిగిస్తుంది.
 
మకరం: ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి చేజారిపోయే ఆస్కారం వుంది. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా ఉంటుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ట్రావెలింగ్ ఏజెన్సీలకు మందకొడిగా వుంటుంది. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి.
 
కుంభం: శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. 
 
మీనం: ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాల ముఖ్య ఉద్దేశం నెరవేరుతుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. బ్యాంకు లోన్లు, పర్మిట్లు మంజూరవుతాయి. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

ప్రేయసికి సర్ప్రైజ్ సెల్ఫీ ఫోటో ఇచ్చేందుకు సింహాలు బోనులోకి వెళ్లిన ప్రియుడు

భూ వివాదం పరిష్కరించమని అడిగితే ప్రైవేట్ గదికి తీసుకెళ్లి మహిళపై అనుచితంగా పోలీసు అధికారి

Madhavi Latha: మాధవి లత వేస్ట్ క్యాండిడేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ ఆడిన ముగ్గురు మృతి.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

31-12-2024 మంగళవారం రాశిఫలాలు : రుణ సమస్యలు తొలగిపోతాయి..

Bird Flies Into Your House? ఇంట్లోకి కాకి, పావురం వస్తే మంచిదేనా?

30-12-2024 సోమవారం దినఫలితాలు : పిల్లల దూకుడు అదుపు చేయండి...

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

తర్వాతి కథనం
Show comments