Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28-12-2020 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినా శుభం .. జయం

28-12-2020 సోమవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించినా శుభం .. జయం
, సోమవారం, 28 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతిని చెందుతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
వృషభం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్ని విధాలా గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం : స్త్రీలకు అయినవారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి తప్పవు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మీ మిత్రుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : పాత వస్తువులు కొని సమస్యలు తెచ్చుకోకండి. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. 
 
సింహం : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. వ్యాపారస్థులకు అధిక శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొనవలసి వస్తుంది. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. 
 
కన్య : ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి పొందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీల అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు. 
 
తుల : అకాల భోజనం, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్త్రీలకు ఇంటి వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధనం ఏమాత్రం ఆదా చేయలేకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం : స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనా లోపం. సభలు, సమావేశాలలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులు ఎదుటివారితో మితంగా సంభాషించడం ఉత్తమం. 
 
ధనస్సు : వైద్యులకు ఆపరేషన్లలో ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన లేఖలు అందుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. మిత్రుల కలయికతో మానసిక ప్రశాంతత పొందుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. 
 
మకరం : బ్యాంకు వ్యవహారాలల ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. దూర ప్రయాణాలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
కుంభం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండిబాకీలు వసూలు కాగలవు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
మీనం : మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంత ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. ఎటువంటి స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - ఆదిత్య హృదయం చదవినా..?